చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు | In a first, ITBP deploys 100 women personnel on China border | Sakshi
Sakshi News home page

చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు

Oct 25 2016 11:22 AM | Updated on Sep 4 2017 6:17 PM

ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారి చైనాతో ఉన్న సరిహద్దుల్లో 15 చోట్ల మహిళలను మోహరించింది.

గ్రేటర్‌ నోయిడా: ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారి చైనాతో ఉన్న సరిహద్దుల్లో 15 చోట్ల మహిళలను మోహరించింది. యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వాడకంలో సుశిక్షితులైన 100 మంది మహిళా జవాన్లను విధుల్లో చేర్చినట్లు ఐటీబీపీ తెలిపింది.

ఎక్కువ మందిని కశ్మీర్‌లోని లఢాక్‌ సరిహద్దులో ఉన్న బీఓపీకి, మరికొంత మందిని హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణా^è ల్‌ సరిహద్దుల్లోకి పంపామంది. 8–14 వేల ఎత్తున్న క్లిష్ట వాతావరణంలో వీరు పనిచేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement