లడఖ్‌ మంచుకొండల్లో ట్రెక్కింగ్‌.. ఫోటోలు వైరల్‌

Ice Wall Climbing Race Organised by ITBP In Ladakh - Sakshi

లడఖ్‌: లడఖ్‌లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్‌ను ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీసు దళాలు నిర్వ‌హించారు. ఈ ట్రెక్కింగ్‌లో 100 మంది బార్డ‌ర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను ల‌డ‌ఖ్ లెఫ్ట్‌నెంట్‌ గ‌వ‌ర్న‌ర్ రాధా కృష్ణ మ‌థూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను  నిర్వహించిన ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులను లెఫ్ట్‌నెంట్‌ గ‌వ‌ర్న‌ర్ రాధా కృష్ణ అభినందించారు.

ఆయన  మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డ‌ర్ పోలీసుల ట్రెక్కింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోల‌ను ఐటీబీపీ త‌న అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top