ఫిబ్రవరి నుంచి ప్రారంభం
టాటా గ్రూప్ ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఇండియా, ఫిబ్రవరి నుంచి కొత్త బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని అంతర్జాతీయ వాణిజ్య సేవలకు ఉపయోగించనుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్ ఇదే. ఈనెల 7న అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న బోయింగ్ ఎవెరెట్ ఫ్యాక్టరీలో ఈ విమానం టైటిల్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం జనవరి 11న ఇది ఢిల్లీకి చేరింది.
ఎయిర్ ఇండియా చివరిసారిగా లైన్ ఫిట్ డ్రీమ్‌లైనర్‌ను 2017 అక్టోబర్‌లో, ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో కొనుగోలు చేసింది. విస్తరణ దిశగా సాగుతున్న ఎయిర్ ఇండియా ఈ ఏడాది మరో ఐదు వైడ్–బాడీ విమానాలను (ఏ350–1000, బీ787–9లు) ఫ్లీట్‌లో చేర్చాలని భావిస్తోంది. ఎయిర్ ఇండియా మొత్తం 350 ఎయిర్‌బస్ విమానాలు, 220 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. ఇప్పటికే ఆరు ఏ350 వైడ్–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరాయి. అలాగే 51 బీ 737–8 న్యారో–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అందాయి.
ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..


