హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంధనం ఆదా చేసే 737 మ్యాక్స్ రకానికి చెందిన మరో 30 బోయింగ్ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరిచ్చింది. దీనితో బోయింగ్‌కి మొత్తం కలిపి దాదాపు 200 విమానాలకు ఆర్డరిచ్చినట్లవుతుంది. మరోవైపు, ఏ321 రకానికి చెందిన 200 విమానాల కోసం ఎయిర్‌బస్‌కి ఇచ్చిన ఆర్డర్‌లో ఎయిరిండియా స్వల్ప మార్పులు చేసింది.
ఇందులో 15 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అధునాతన ఎ 321ఎక్స్‌ఎల్‌ఆర్ (ఎక్స్‌ట్రా లాంగ్ రేంజ్) వేరియంట్‌కి మార్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి 2029–2030 మధ్యలో డెలివర్ అ య్యే అవకాశం ఉందని వివరించింది. ఇంధనం ఆదా చేసే ఎ321 ఎక్స్‌ఎల్‌ఆర్ విమానా లకు దాదాపు 8,700 కి.మీ. రేంజి ఉంటుంది.


