రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్‌ | Air India Flight From Kochi Skids Off Runway At Mumbai Airport Details, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్‌

Jul 21 2025 1:33 PM | Updated on Jul 21 2025 2:21 PM

Air India flight from Kochi skids off runway at Mumbai Airport Details

కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్ర​యాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. 

కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్‌ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్‌ నుంచి దిగేశారు.  ఈ ఘటనతో ఇంజిన్‌ కూడా డ్యామేజ్‌ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement