
గడ్చిరోలి జిల్లాలోని నక్సల్ ప్రభావిత గ్రామం మర్కనార్‌కు తొలిసారిగా బస్సు సర్వీసు
జెండా ఊపి ప్రారంభించిన గడ్చిరోలి నీలోత్పల్
సంబరాలు చేసుకున్న స్థానిక ప్రజలు
గడ్చిరోలి: మహారాష్ట్ర నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ ఉపవిభాగంలో నక్సల్స్ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: US Woman 16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి