ఫైల్ ఫోటో
గన్నవరం: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గురువారం(డిసెంబర్ 18వ తేదీ) రాత్రి గం. 8.10ని.లకు టేకాఫ్ కావాల్సిన విమానం.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, ఈరోజు ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్‌లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి:


