మనం ఏ పని చేయాలన్నా ప్రకృతి అనుకూలత అనేది చాలా ముఖ్యం. మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలిస్తున్నాయంటే అక్కడ ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి. సెల్ఫ్ ఎఫర్ట్ (మానవ ప్రయత్నం)కు ప్రకృతి అనుకూలించిందంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం అనే బండి ముందుకు పోతుంది.
ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్న దాఖలాలు కూడా చూశాం. అయితే కొన్ని రోజుల క్రితం ఓ భారీ విమాన ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
ఖతార్ ఎయిర్‌వేస్ విమానం.. డిసెంబర్ 14వ తేదీన దోహా నుండి బయల్దేరింది. అయితే అది అమెరికాలోని అట్లాంటాకు చేరుకున్న తర్వాత బలమైన గాలుల కారణంగా ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేద్దామని పైలట్ ప్రయత్నించాడు. ఆ బలమైన గాలులకు విమానం నియంత్రణ కోల్పోవడంతో ఓ ప్రయత్నంగా ల్యాండింగ్‌కు యత్నించాడు. కానీ విమానం వెనుక భాగం రన్‌వేకు తాకడానికి అత్యంత సమీపంగా వచ్చిన సమయంలో మళ్లీ పైలట్ టేకాఫ్ తీసుకున్నాడు. ఇక్కడ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం ఒకటైతే.. ఆకాశం కరుణించి.. భూమి శాంతించడంతో మళ్లీ విమానం తిరిగి యధాస్థితికి వెళ్లిపోయింది. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Meanwhile in ATL 🤏
Video: Kyle Marcks pic.twitter.com/cOOICcfRaG— Breaking Aviation News & Videos (@aviationbrk) December 16, 2025
దీనిపై ఖతార్ ఎయిర్‌వేస్ అధికారులు మాట్లాడుతూ.. తమ పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ల్యాండింగ్ తీసుకోకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇలా అత్యవసరంగా ల్యాండింగ్ పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలు అనేవి సహజంగానే ఉంటాయని, ప్రయాణికుల్లో ఇది ఇంకా గందరగోళానికి గురిచేస్తుందన్నారు.


