పార్క్‌ చేసిన విమానాన్ని ఢీకొన్న మరో విమానం | Montana Plane Crash Plane Crashes Into Parked Aircraft | Sakshi
Sakshi News home page

America: పార్క్‌ చేసిన విమానాన్ని ఢీకొన్న మరో విమానం

Aug 12 2025 8:03 AM | Updated on Aug 12 2025 11:41 AM

Montana Plane Crash Plane Crashes Into Parked Aircraft

కాలిస్పెల్: అమెరికాలోని మోంటానా విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న ఒక చిన్న విమానం ఆగి ఉన్న మరో విమానంపైకి దూసుకెళ్లింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ  ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోకాటా  టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం నేలపై ప్రయాణికులు లేని ఒక ఖాళీ విమానాన్ని ఢీకొన్నదని  అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆ ప్రాంతం అంతటినీ పొగ కమ్ముకుంది.

మోంటానా  విమానాశ్రయం 30 వేల జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో ఆ విమానం నుంచి పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని, విమానాశ్రయంలోనే వారికి చికిత్స అందించారని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement