అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్‌లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్ నివాసి భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.
వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది యువతి. క్యాబ్ రైడ్ సమయంలో దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్‌లు అనుమానిస్తున్నారు.
బెయిల్ కోసం రూ. 4.52 కోట్లు
సెఖోన్‌ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్ రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డ
కాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది.


