Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం! | Air India Passenger Urinates On Fellow Traveller On Delhi-Bangkok Flight, Banned For 30 Days | Sakshi
Sakshi News home page

Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!

Apr 9 2025 9:38 PM | Updated on Apr 10 2025 1:23 PM

Air India Passenger Urinates On Fellow Traveller

ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.

ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.

ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్‌లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.

ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది.  

 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement