ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్‌ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్‌బుక్‌లో నమోదు చేశారు.
అందులో ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అంటే బొద్దింకను చనిపోయే వరకు ఉరి తీశారు అని పేర్కొన్నారు. అంతే ఈ లాగ్‌బుక్ ఘటన నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.
An entry in Air India’s cabin defect log recorded that a live cockroach was discovered by a passenger. The rectification note wryly mentioned that the matter was dealt with… conclusively.
Khalaas, Dubai style pic.twitter.com/sifW6NNtG5— Jagriti Chandra (@jagritichandra) October 25, 2025
ఈ ఘటనపై నెటిజన్లు ఎగ్జిక్యూషన్ అనే పదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. మరికొ మరికొందరు విమానంలో హైజీన్ స్టాండర్డ్స్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిరిండియా విమానం అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే, విమానాల్లో శుభ్రత, హైజీన్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విమానంలో లాగ్‌బుక్
విమానంలో లాగ్‌బుక్ (Logbook) అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది విమాన సిబ్బంది, పైలట్లు, మైంటెనెన్స్ టీమ్ కోసం ఉపయోగపడే అధికారిక రికార్డు. విమానంలో ఏదైనా సమస్య (ఉదాహరణకు: లైట్స్ పని చేయకపోవడం, సీటు సమస్య, బొద్దింక కనిపించడం) ఉంటే, దాన్ని లాగ్‌బుక్‌లో రాసి మైంటెనెన్స్ టీమ్‌కు తెలియజేస్తారు.ప్రతి చిన్న సమస్యను నమోదు చేయడం వల్ల..తదుపరి ప్రయాణానికి ముందు వాటిని పరిష్కరిస్తారు.


