
సాక్షి, విశాఖపట్నం: పైలట్ అప్రమత్తతతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానం బయల్దేరగా.. కొంతదూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.
పైలెట్.. చాకచక్యంగా మార్గమధ్యలోనే వెనుతిరిగి విశాఖలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.