న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.
ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.
DGCA కీలక ఆదేశాలు
విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.
ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!
ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది.


