breaking news
ash clouds
-
ఇండియాకు బూడిద మేఘాలు : డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.DGCA కీలక ఆదేశాలువిమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది. -
అగ్నిపర్వతం బద్దలు.. అధికారుల్లో టెన్షన్.. కారణం ఇదే..
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K— AFP News Agency (@AFP) May 18, 2025 -
పల్లెపై బూడిద పడగ..
సాక్షి, తోటపల్లిగూడూరు: తీర ప్రాంతం పల్లెలపై బూడిద పడగేస్తోంది. పచ్చని పల్లెలు పవర్ ప్రాజెక్ట్‌లు వెదజల్లే వాయు కాలుష్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మండలంలోని వరకవిపూడి పంచాయతీ అనంతపురంలో సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ (ఎన్‌సీసీపీపీఎల్) ఏర్పాటైంది. 1,300 మెగావాట్ల విద్యుతుత్పత్తి లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం విద్యుతుత్పత్తి కొనసాగిస్తోంది. దీనికి సమీపంలోనే టీపీసీఎల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తన కార్యకాలాపాలను సాగిస్తోంది. విద్యుతుత్పత్తి ప్రారంభించిన సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ ఏడాదికే విషవాయువుల రూపంలో తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో వెలుబడుతున్న విష వాయువులు వరకవిపూడి, మండపం పంచాయతీలతో పాటు ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. మనుషులు.. మొక్కలు విలవిల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లతో వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయతీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్‌పురం, గొల్లపాళెం గ్రామాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద, విషవాయులు ఇళ్లను చుట్టుముట్టతుండంతో ఆరుబయట విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. క్యాన్సర్, అల్సర్, ఇతర గుండె సంబంధిత వ్యాధులతో స్థానికులు వైద్యశాలల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. ఇళ్లల్లో పెంచుకొంటున్న పూల మొక్కలతో పాటు ఏళ్ల నాటి వటవృక్షాలు సైతం ఎండుముఖం పట్టి మోడు బారిపోతున్నాయి. ఏళ్ల తరబడి నీడతో పాటు ప్రాణవాయువును ఇచ్చిన పచ్చని చెట్లు తమ కళ్లెదుటే నిలువునా ఎండిపోతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేçస్తున్నారు. స్థానికంగా ఉన్న వందల ఎకరాల్లో పంటలు సైతం పండక భూములను బీళ్లుగా మార్చుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. వరిపైర్లపై వీటి ప్రభావం అధికంగా ఉండడంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు దాపరించాయని స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ కారణంగా పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి. ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో కాలుష్యం విడుదలవుతూ పంటలు, పూల మొక్కలు, చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. కాలుష్యంతో స్థానికులు వివిధ రోగాల బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలవుతున్న కాలుష్యం నియంత్రణ విషయంలో కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం. – ఉప్పల శంకరయ్యగౌడ్, అనంతపురం చెప్పిందొకటి.. చేస్తుంది మరొకటి ప్రాజెక్ట్ ప్రారంభం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, కనీస సౌకర్యాల కల్పనలో సెంబ్‌కార్ఫ్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యం పూర్తిగా గాలికొదిలేసింది. కాలుష్యం బారిన పడిన గ్రామాలకు, స్థానికులను రక్షించండంటూ మొత్తుకొంటున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విషయాయుల ప్రభావంతో స్థానిక గ్రామాల ప్రజలు అనేక రోగాలతో అల్లాడుతున్నారు. విషవాయువులు అధికమై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకీడుస్తున్న పైనాపుపురం గ్రామ వాసులను వేరే ప్రాంతానికి తరలించాలని అభ్యర్థిస్తున్న ఉలుకుపలుకు లేదు. – నెల్లూరు శివప్రసాద్, పైనాపురం -
బద్దలైన అగ్నిపర్వతం: ఏడుగురి మృతి
ఇండోనేషియా: ఇండోనేషియాలోని గాంబెర్‌లో ఆదివారం సినాబంగ్ అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీని ప్రభావంతో సమీప ప్రాంతాల్లో సేద్యం చేసుకుంటున్న ఏడుగురు దుర్మరణం చెందారు. అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో లావా వెలువబడుతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన తీవ్రమైన వేడి, విషవాయువులతో కూడిన బూడిద పెద్ద ఎత్తునా ఆకాశంలోకి చిమ్మతూ మూడు కిలోమీట్లరకు పైగా ఆవరించింది. గాంబెర్‌లోని సమీప నివాస గృహాలపైనా, వాహనాలపైనా బూడిద విస్తరించింది. అగ్నిపర్వతం విస్పోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని చిక్కుకున్న వేలమంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 400 సంవత్సరాల పాటు నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా విజృంభించింది. గత 2010, 2014 సంవత్సరాలలో సినాబంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి 12 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా, ఇండోనేషియా చుట్టూ 120 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఆవరించి ఉన్నాయి.


