
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K
— AFP News Agency (@AFP) May 18, 2025