
న్యూఢిల్లీ: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతికపరమైన లోపం కారణంగా టేకాఫ్‌ను నిలిపివేసింది. ఆటో-థ్రోటిల్ పనిచేయడంలో విఫలం కావడంతో, విమానం తిరిగి తనిఖీల కోసం నిలిచిపోయింది. సోమవారం ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంకేతికపరమైన లోపం తలెత్తింది.
విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రన్‌వే 29ఆర్‌లో ప్రారంభమైన టేకాఫ్ రోల్ సమయంలో ఆటో-థ్రోటిల్ వ్యవస్థ ఆశించిన విధంగా పనిచేయలేదు. దీంతో కెప్టెన్ దాదాపు 60 నాట్ల వేగంతో టేకాఫ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సంబంధిత ఇంజనీర్‌లతో సంప్రదించి, నిర్దిష్ట నిర్వహణ విధానం కింద తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డౌన్‌లోడ్ కోసం విమానాన్ని తిరిగి దాని స్థానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పరిశోధించేందుకు ప్రస్తుతం ఇంజనీరింగ్ తనిఖీలు జరుగుతున్నాయి.
#Flight stopped at the time take off due to technical problems
164 passengers are in flight
No information about alternative arrangements
Justice Battu Devanand, Judge of AP High Court is travelling in the flight. pic.twitter.com/po4wPHYzKe— endla janardhan (@endlajanardhana) August 4, 2025
సాంకేతిక లోపం తో ఢిల్లీ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో.. ఈ ఘటన జరిగిన సమయంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. విమానంలో వృద్దులు, చిన్నారులు , మధుమేహ రోగులు ఉన్నారని, వీరికి తక్షణం ఆహారం అందించాలని విమాన సిబ్బందిని ఆయన కోరారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆహారం అందించారు.