ఎయిర్‌ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్‌ విమానాలకు ఆర్డర్‌?

Air India Order More Than 200 Boeing Jets - Sakshi

ప్రముఖ దేశీయ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిర్‌ ఇండియా..అమెరికా విమానాల త‌యారీ సంస్థ బోయింగ్‌ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్‌ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే ఎయిర్‌ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు. టాటా స‌న్స్ ఎయిరిండియా ప్ర‌తినిధులు స్పందించలేదు. కాగా, అంత‌ర్జాతీయ రూట్ల‌లో బోయింగ్ 787 డ్రీమ్ లైన‌ర్ జెట్ విమానాలు, ఎయిర్ బ‌స్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్‌ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాల‌ను లీజ్‌కు తీసుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top