
ఢిల్లీ: ప్రతిపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై చర్చ జరపాలని విపక్షాల పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనికి సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు నిబంధనలను గుర్తు చేస్తూ ఈ అంశంపై చర్చించలేమని అన్నారు.
దీనికి ముందు ఇండియా బ్లాక్ నేతలు బీహార్ ప్రత్యేక ఓటరు సవరణ నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పెద్దగా పురోగతి సాధించిందే లేదు. ఇండియా బ్లాక్ నిరసనలతో అంతరాయం కలుగుతోంది.
లోక్‌సభలో వర్షాకాల సమావేశాలు సోమవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ గందరగోళం కారణంగా సభా కార్యకలాపాలు ముందుకు కొనసాగలేదు. స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను వారి స్థానాలకు వెళ్లి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గందరగోళం కారణంగా సభ ప్రారంభమైన 10 నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
#WATCH | Rajya Sabha members pay tribute to member of Parliament, former Jharkhand CM and founding patron of JMM, Shibu Soren, who passed away at Sir Ganga Ram Hospital in Delhi today after prolonged illness.
Video source: Sansad TV/YouTube pic.twitter.com/qpje78kVrj— ANI (@ANI) August 4, 2025
ఇక నేటి రాజ్యసభ కార్యకలాపాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ శిబు సోరెన్ మృతిపై సభలో సభ్యులంతా సంతాపం వ్యక్తం చేశారు. తరువాత ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. తమ కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా, ఆగస్టు 8 ఉదయం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రతిపక్షాలు మార్చ్ నిర్వహించనున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో పార్లమెంటు సభ్యుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు.