ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానీ మృతి | Ex Gujarat CM Vijay Rupani on Air India flight that crashed in Ahmedabad? | Sakshi
Sakshi News home page

Ahmedabad: ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానీ మృతి

Jun 12 2025 2:57 PM | Updated on Jun 12 2025 8:38 PM

Ex Gujarat CM Vijay Rupani on Air India flight that crashed in Ahmedabad?

గాంధీ నగర్‌: గుజరాత్‌ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్‌ నుంచి లండన్‌ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 

ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు  కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. 

(విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్‌ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)

ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్‌ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్‌ పాటిల్‌ విచారం వ్యక్తం చేశారు. 

 

పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్‌ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్‌ క్లాస్‌లో రూపానీ టికెట్‌ బుక్‌ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్‌ ఉంది. ఆ విమానం టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు.  

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం..!

విమానంలో 242 మంది: డీజీసీఏ
అహ్మదాబాద్‌లో ప్ర‌మాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. వీరిలో ఇద్ద‌రు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఉన్నారు.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్‌, ఏడుగురు పోర్చుగీస్‌ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్‌  వేదికగా వెల్లడించింది.

ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement