హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం | Glitch On Air India San Francisco Mumbai Flight | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం

Jun 17 2025 7:57 AM | Updated on Jun 17 2025 11:29 AM

Glitch On Air India San Francisco Mumbai Flight

కోల్‌కతా: అహ్మదాబాద్‌ విషాద ఘటన మరవకముందే.. ఎయిర్‌ ఇండియా విమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత శనివారం.. గువాహటి– కోల్‌కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికులు కలవరపాటుకు గురైన సంగతి తెలిసిందే. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు.

తాజాగా, మరో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న ఎయిరిండియా విమానం (AI 180).. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేసుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తగా.. సిబ్బంది వెంటనే గుర్తించి అలర్ట్‌ అయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.

కాగా, నిన్న(సోమవారం) కూడా.. హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టేకాఫ్‌ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం హాంకాంగ్‌లో క్షేమంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ315 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.16 గంటలకు హాకాంగ్‌ నుంచి బయలుదేరింది.

8.50కి టేకాఫ్‌ కావాల్సిన విమానం.. అప్పటికే మూడున్నర గంలు ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్‌ అయిన గంట తరువాత విమానం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు విమానాన్ని హాంకాంగ్‌లో ల్యాండ్‌చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ సమస్య ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని హాంకాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ తెలిపింది. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ప్రమాదం తర్వాత బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌తో సంబంధం ఉన్న జెట్‌ వెనక్కి తిరిగి వెళ్లడం ఇది రెండోసారి. ఆదివారం.. చెన్నైకి వస్తున్న బ్రిటన్‌ ఎయిర్‌వేస్‌ డ్రీమ్‌లైనర్‌ కూడా సాంకేతిక సమస్య కారణంగా లండన్‌కు తిరిగి వెళ్లింది.
 

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement