
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న.. ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రాహుల్ మాట్లాడుతూ..
‘‘నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. నేను దేనికి భయపడను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. కాంగ్రెస్ తప్పును తప్పు అని చెబుతుంది. నిజం ఉన్న చోట దైర్యం ఉంటుంది. బీజేపీకి ధైర్యం లేదు.. నిజం చెప్పలేదు’’ అని రాహుల్ మండిపడ్డారు.
10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు.. మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు. లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయొచ్చా...? రిగ్గింగ్ జరిగిందా అనేది నిరూపిస్తాం. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ లో తప్పిదాలున్నాయి.. దాన్ని నిరూపించాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది.. దానికి సంబంధించి ఆధారాలున్నాయి. ఈసీ స్కాన్ ప్రొటెక్ట్ ఓటర్ లిస్ట్ ఎందుకు కలిగి ఉంది?. ఆరున్నర లక్షల ఓటర్లలో లక్షన్నర ఓట్లు ఫేక్ ఓట్లు.
ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం.ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు?. మేము రాజకీయంగా పోరాడుతున్నాం.. రాజ్యంగం కోసం న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతోంది న్యాయవాదులే అని రాహుల్ అన్నారు.
#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."
He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025