వాద్రాతో పాటు మోదీనీ విచారించాలి : రాహుల్‌

Rahul Demands Investigate Everybody Be It Vadra Or PM - Sakshi

చెన్నై : ఆరోపణలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ విచారించే హక్కు ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలని, కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే కాదని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని సమాంతర చర్చలు జరిపారని ప్రభుత్వ పత్రాల్లోనే వెల్లడైందని, ఆరోపణలు వచ్చిన ప్రతిఒక్కరిపై వాద్రా అయినా ప్రధాని మోదీ అయినా అందరినీ విచారించాలని డిమాండ్‌ చేశారు.

రాహుల్‌  బుధవారం చెన్నైలోని స్టెల్లా మేరీస్‌ కళాశాలలో పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడైనా 3000 మంది మహిళల మధ్యలో నిలుచుని ఇలా మాట్లాడారా..? మీరు అడిగే ప్రశ్నలకు బదులిచ్చారా అని నిలదీశారు. దేశంలో ప్రస్తుతం రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరాటం సాగుతోందని, ప్రజలంతా కలిసిమెలిసి ఐక్యంగా జీవించాలన్నది ఒక సిద్ధాంతమైతే, తమ భావజాలాన్ని దేశంపై రుద్దాలని మోదీ సర్కార్‌ అనుసరిస్తున్న మరో సిద్ధాంతమని చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top