
రాంచీ: జార్ఖండ్‌లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, హుటాహుటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
మంత్రి రాందాస్ సోరెన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. రాందాస్ సోరేన్ తన ఇంట్లో కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు. నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి రాందాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, మంత్రి రాందాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH | Jamshedpur: JMM leader Mangal Kalindi says, "Preparations are going on to take him to Delhi for treatment..." https://t.co/Y5ZRgUVFot pic.twitter.com/B8KSg5Teok
— ANI (@ANI) August 2, 2025