breaking news
medanta Hospital
-
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. నేరుగా అక్కడకు..
గురుగ్రామ్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సోనమ్ వాంగ్‌చుక్ తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే వచ్చానని వాంగ్‌చుక్ అన్నారు. అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమని చెప్పారు. ఇంతకు ముందు వాంగ్‌చుక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేస్తూ.. "ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా శరీరం నెమ్మదిగా బలాన్ని తిరిగి పొందుతోంది" అని చెప్పారు. లద్ధాక్‌కు తిరిగి వెళ్లే ముందు మహాత్మా గాంధీకి నివాళి అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు వెళ్తానని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సాగిన విద్యార్థుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మెదాంతా ఆస్పత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. "డిశ్చార్జ్ చేసే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయన పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఔట్ పేషెంగ్లా వచ్చి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించాం" అని మెదాంతా ది మెడిసిటీ వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ దురాణి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.వాంగ్‌చుక్ జూలై 21న ఢిల్లీలో జరిగిన 'సంసద్ చలో' ర్యాలీ తర్వాత ప్రైవేట్ ఆసుత్రిలో చేరారు. జూలై 18న జంతర్ మంతర్ నుంచి ఆయనను తీసుకెళ్లి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్షకు నాయకత్వం వహించారు. ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు ముందు, జూలై 24న ఆయన నిరాహార దీక్షను ముగించారు. -
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్‌చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్‌చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్‌చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్‌చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
సోనమ్ వాంగ్చుక్కు బిగ్ రిలీఫ్?!
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తమవుతున్న ఆందోళనలను విస్మరించలేమని స్పష్టం చేసిన కోర్టు.. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం ఆయన ప్రాణాలను కాపాడటమేనని పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించే ప్రతిపాదనను పరిశీలించింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షా విధానంలో మార్పులు కోరుతూ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన అనుమతి లేకుండా ఆసుపత్రికి తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపై నమ్మకం లేదని ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను కుటుంబం కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా కోర్టు.. వాంగ్‌చుక్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆందోళనలు, మెరుగైన వైద్య సదుపాయాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ సందర్భంగా హైకోర్టు.. “ఆయన ప్రాణాలను కాపాడటమే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత” అని పేర్కొంది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించిన కోర్టు.. అందుతున్న చికిత్స వివరాలను కూడా కోరింది.వాంగ్‌చుక్ తన తరలింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను కలిసేందుకు పరిమితులు విధించారని, తన పరికరాలను తీసుకున్నారని, కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.కాగా.. విద్యార్థుల సమస్యలు, పరీక్షా వ్యవస్థలో లోపాలు, విద్యా రంగ సంస్కరణల డిమాండ్లతో వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో 20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అయింది. దీంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.వాంగ్‌చుక్ ఆసుపత్రికి తరలింపు అంశం నేపథ్యంలో కాక్రోచ్ జంతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్టీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వైద్యుల సూచనలు, భద్రతా కారణాల దృష్ట్యానే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం వాంగ్చుక్ను మెదాంత ఆసుపత్రికి తరలించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం తరఫున న్యాయవాది కూడా మెదాంతకు తరలింపుపై అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా తరలింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు జోక్యంతో వాంగ్‌చుక్ ఆరోగ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి.. మరోవైపు ఆయన డిమాండ్లపై కొనసాగుతున్న ఆందోళనలు ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. -
బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి.. ఆరోగ్య పరిస్థితి విషమం
రాంచీ: జార్ఖండ్‌లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, హుటాహుటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మంత్రి రాందాస్ సోరెన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. రాందాస్ సోరేన్ తన ఇంట్లో కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు. నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి రాందాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, మంత్రి రాందాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #WATCH | Jamshedpur: JMM leader Mangal Kalindi says, "Preparations are going on to take him to Delhi for treatment..." https://t.co/Y5ZRgUVFot pic.twitter.com/B8KSg5Teok— ANI (@ANI) August 2, 2025 -
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ములాయం సింగ్ యాదవ్.. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
లక్నో: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం వరకు ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్‌ను పార్టీ వర్గాలు ట్విటర్ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. मेदांता अस्पताल ने जारी किया आदरणीय नेताजी का हेल्थ बुलेटिन। हम सभी आदरणीय नेताजी के जल्द स्वस्थ और दीर्घायु होने की कामना करते हैं। pic.twitter.com/myCZJIzKMY — Samajwadi Party (@samajwadiparty) October 4, 2022 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్ షా -
ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్
లక్నో: ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు. చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్లో రగడ -
ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు కాంగ్రస్ నేతలు కమల్ నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్ నాథ్‌పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని కమల్‌నాథ్ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్ కేసులో సిట్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. पूर्व मुख्यमंत्री श्री कमलनाथ जी के अस्वस्थ होने की सूचना मिली है। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। @OfficeOfKNath — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 9, 2021 -
ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్ మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్న మేదాంత ఆస్పత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు అంటుకోవడంతో బ్యాంకాక్ సమీపంలో కూలిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ ఘటనలో పైలట్ అరుణక్షా నంది అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బ్యాంకాక్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వరుస ట్వీట్లు చేశారు. గాయపడ్డ వారిలో డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుష్మ తెలిపారు.


