విషమంగా సమాజ్‌వాదీ ములాయం సింగ్‌ ఆరోగ్యం

Samajwadi Party Founder Mulayam Singh Yadav Health Critical - Sakshi

లక్నో: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. 

సోమవారం వరకు ఆయనకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్‌ బులిటెన్‌ను పార్టీ వర్గాలు ట్విటర్‌ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. 

82 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్‌ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్‌ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్‌ షా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top