Azam Khan: ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్‌

SP Leader Azam Khan Admitted In Hospital Akhilesh Yadav Visited - Sakshi

లక్నో: ఎస్పీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్‌ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు.
చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్‌లో రగడ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top