
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమర్ధించారు. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. చనిపోయింది భారత్ ఆర్ధిక వ్యవస్థ కాదని.. రాహుల్ గాంధీ రాజకీయ జీవితం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్రంప్ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఫలితంగా భారత్,రష్యాల ఎకానమీ డెడ్ ఎకానమీ అని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మీడియాలో మాట్లాడారు. ట్రంప్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తూ.. ‘ప్రతి ఒక్కరికీ తెలుసు భారత ఆర్థిక వ్యవస్థ మరణం అంచున ఉంది. భారత ఆర్ధిన వ్యవస్థను మోదీ దాన్ని నాశనం చేశారు. నోటు రద్దు , జీఎస్టీ, నిరుద్యోగాన్ని ఉదహరించారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత విజయాలను అవమానపరిచేలా ఉన్నాయి. భారత్ ఎకానమీ కాదు.. మరణించింది రాహుల్ గాంధీ రాజకీయ విశ్వసనీయత. విదేశీ వ్యతిరేకులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో మోదీ ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సంబిత్ పాత్రా రాహుల్ గాంధీ ఏ దేశ పక్షాన ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
కర్ణాటక బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ కాదు..రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు’ అని అన్నారు. ఇంతలో బీజేపీ నాయకులు భారత్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివర్ణిస్తూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంచనాలను ప్రస్తావించారు