తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్‌లో చంద్రబాబు, పవన్‌: భూమన | YSRCP Bhumana Karunakar Reddy Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్‌లో చంద్రబాబు, పవన్‌: భూమన

Feb 5 2026 6:46 PM | Updated on Feb 5 2026 7:28 PM

YSRCP Bhumana Karunakar Reddy Serious On CBN Govt

సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్‌ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్‌ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్‌ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

పదేళ్లలో పవన్‌ చెప్పినవి ఇవే.. 
జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్‌.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.

చంద్రబాబుది దైవ ద్రోహం.. 
చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్‌, నేను. వైఎస్సార్‌ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్‌గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్‌. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.

వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్‌ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement