‘ఇల్లు నాదే’ .. కబ్జాకు టీడీపీ నేత కుట్ర | TDP Leader Katragadda Raghu Attempted To Occupy A House In Ongole, Victim Demands Immediate Arrest | Sakshi
Sakshi News home page

‘ఇల్లు నాదే’ .. కబ్జాకు టీడీపీ నేత కుట్ర

Feb 5 2026 6:16 PM | Updated on Feb 5 2026 6:37 PM

TDP leader katragadda raghu attempted to occupy a house in Ongole

సాక్షి,ఒంగోలు: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకీ శృతిమించిపోతున్నాయి. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. యజమానులను బెదిరించి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ‘నువ్వు కట్టుకున్న ఇల్లు నాదే.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో’.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

తాజాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేత కాట్రగడ్డ రఘు కన్నుపడింది. అంతే అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్‌ను రఘు అనుచరులు ఇంట్లోకి ప్రవేశించి, ఆయనను బలవంతంగా బయటకు గెంటివేశారు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి.. ‘ఇల్లు మాది’ అంటూ బెదిరింపులకు దిగారు.  

బాధితుడు శివకుమార్ మాట్లాడుతూ.. తాను స్థలం కొనుగోలు చేసి, కష్టపడి ఇల్లు నిర్మించుకున్న తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయని వాపోయాడు. రఘు,ఆయన అనుచరులు తమను టార్గెట్ చేస్తూ, ఇల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దిక్కున చోటు చెప్పుకో పో’ అంటూ రఘు అనుచరులు బెదిరింపులకు దిగారని మీడియా ఎదుట వాపోయారు. తమకు న్యాయం చేయాలని, దాడులకు తెగబడుతున్న రఘును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement