సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్‌కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.


