న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.
పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.
బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్‌సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు.


