ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో పైలట్ సుమీత్ సబర్వాల్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్‌ను విచారణకు పిలవడంపై భారత పైలట్ల సమాఖ్య(FIP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విమాన ప్రమాద పరిశోధనా బ్యూరో (AAIB)కు పైలట్ల సమాఖ్య నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేధింపులకు గురిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఆనంద్‌కు ఆ విమానం, ఆ ఫ్లైట్‌తో ఎలాంటి సంబంధం లేదని.. మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులను విచారణకు పిలవడం సరికాదని సమాఖ్య పేర్కొంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై స్పందించిన ఏఏఐబీ.. తాము చట్ట ప్రకారంగానే వ్యవహరించామని, విచారణకు అవసరమైతే ఎవరినైనా పిలుస్తామంటూ తేల్చి చెప్పింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్‌లు మృతి చెందగా.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమిత్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్‌కు ఏఏఐబీ సమన్లు జారీ చేసింది. జనవరి 15న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న వరుణ్ ఆనంద్.. ‘భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నారు.


