ఢిల్లీ: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి పైలెట్ తప్పిదమే కారణమనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వని పైలట్లు.. రన్ వే సరిగ్గా కనిపించక అంచనా తప్పినట్లు సమాచారం. తొలి ప్రయత్నంలో పైలట్లు ల్యాండ్ చేయలేకపోయారు. రెండో ప్రయత్నంలో 8:44కు విమానం ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఇచ్చిన సూచనలకు పైలట్ ఇచ్చే సమాధానమే రీడ్‌బ్యాక్..
విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం సిద్ధమవగా.. మొదట రన్‌వే కనిపించడం లేదని చెప్పిన పైలట్లు.. కొన్ని సెకన్ల తర్వాత రన్‌వే కనిపిస్తోందని తెలిపారు. ఉదయం 8:43 గంటల సమయంలో విమానానికి రన్‌వే 11పై ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. అయితే, సాధారణంగా పైలట్లు ఇచ్చే తిరుగు సమాధానం (Readback) ఈసారి రాలేదు. సరిగ్గా నిమిషం తర్వాత, రన్‌వే వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం ఏటీసీ గుర్తించింది. అయితే.. ఈ దుర్ఘటనలో విమానం ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పైలట్ రీడ్‌బ్యాక్ చేయకపోవడం ప్రమాదానికి దారి తీసినట్లు కేంద్రం పేర్కొంది.
ఏ క్షణం.. ఏం జరిగింది?
👉ఉదయం 8:18 నిమిషాలకు తొలిసారిగా బారామతి ఎయిర్ ఫీల్డ్‌ను కాంటాక్ట్ చేసిన విమానం
👉30 నిమిషాల తర్వాత పూణే ఎయిర్ కంట్రోల్ నుంచి బారామతికి కంట్రోల్‌లోకి విమానం
👉విజిబులిటీ, గాలి వేగం గురించి అడిగిన పైలట్లు.. 3000 మీటర్ల విజిబిలిటీ, సాధారణ గాలి వేగం
👉రన్ వే 11 పై ల్యాండింగ్ కోసం ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్
👉ఫస్ట్ అప్రోచ్‌లో రన్ వే కనిపించకపోవడంతో గో అరౌండ్‌కు వెళ్లిన విమానం
👉గో అరౌండ్ తర్వాత.. విమానం పొజిషన్ గురించి అడిగిన పైలెట్.. మరోసారి ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్
👉రన్ వే కనిపిస్తుందా? అని అడిగిన ఏటిసీ..
👉ప్రస్తుతం కనిపించడం లేదు.. కనిపించిన తర్వాత కాల్ చేస్తామన్న పైలెట్
👉కొన్ని సెకన్ల తర్వాత రన్ వే కనిపిస్తుందని వెల్లడించిన పైలెట్
👉ఉదయం 8:43 నిమిషాలకు రన్ వే లెవెన్‌పై ల్యాండింగ్ క్లియరెన్స్.. అయితే కీలకమైన "రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్" సమాధానం ఇవ్వని పైలట్
👉ఉదయం 8:44 నిమిషాలకు రన్‌వే పక్కన భారీ ఎత్తున మంటలు.. క్రాష్ అయిన విమానం
👉రన్ వే 11కు ఎడమ వైపున విమాన శకలాలు


