ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమానాలు రద్దు | Air India Cancels All Middle East Europe And Us Flights, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమానాలు రద్దు

Jun 24 2025 8:02 AM | Updated on Jun 24 2025 11:37 AM

Air India Cancels All Middle East Europe And Us Flights

గల్ఫ్‌ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్‌ మీదుగా వెళ్లే  విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్‌, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్‌ ఇండియా నిలిపివేసింది.

మరోవైపు, ఖతార్‌లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఖతార్‌ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్‌ తెలిపింది. కాగా, ఇరాన్‌ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్‌ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్‌ స్పష్టం చేసింది.

కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్‌ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ ప్రకటించాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement