ఎయిర్ ఇండియా బంపరాఫర్: రూ. 1200కే ఫ్లైట్ టికెట్! | Air India Express Pay Day Sale Know The Fares Details | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా బంపరాఫర్: రూ. 1200కే ఫ్లైట్ టికెట్!

Sep 28 2025 8:13 PM | Updated on Sep 28 2025 8:21 PM

Air India Express Pay Day Sale Know The Fares Details

చాలామంది ఇప్పటికి కూడా ఒక్కసారైనా విమాన ప్రయాణం చేసి ఉండరు. అలాంటి వారికోసం.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'పేడే సేల్' కింద ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే.. దేశీయ విమాన ఛార్జీల ప్రారంభ ధర రూ.1200 కాగా, అంతర్జాతీయ టికెట్స్ ధర రూ. 3724 నుంచి ప్రారంభమవుతాయి.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘పేడే సేల్’ కోసం బుకింగ్‌లు అక్టోబర్ 1, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 30, 2025 వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ఛార్జీల కోసం వినియోగదారులు 'FLYAIX' ప్రోమో కోడ్‌ ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి: కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై డీఎఫ్ఎస్ఏ ఆంక్షలు

ఎయిర్‌లైన్ మొబైల్ యాప్‌లో చేసిన అన్ని బుకింగ్‌లపై ఎయిర్‌లైన్ జీరో కన్వీనియన్స్ ఫీజులను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలతో.. చెక్ ఇన్ బ్యాగేజిపై తగ్గింపులు లభిస్తాయి. దేశీయ విమానాలలో 15 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.1,500, అంతర్జాతీయ విమానాలలో 20 కేజీల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ. 2500 వసూలు చేస్తారు. ఇది సాధారణ ధరల కంటే చాలా తక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement