భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు | Commercial LPG Cylinder Prices Hiked By Rs 111 on New Year | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

Jan 1 2026 2:29 PM | Updated on Jan 1 2026 2:49 PM

Commercial LPG Cylinder Prices Hiked By Rs 111 on New Year

2026 సంవత్సరం మొదటి రోజు భారతదేశం అంతటా.. హోటళ్ళు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను రూ.111 పెంచాయి. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది.

ముంబైలో కూడా ఇదే విధంగా రూ.1,531.50 నుంచి రూ.1,642.50కి పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1,684 నుంచి రూ.1,795కి పెరిగింది. చెన్నైలో అత్యధిక ధరలు (రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి) నమోదయ్యాయి. ధరలు పెరగడం వల్ల.. రోజువారీ కార్యకలాపాలకు గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement