బిజినెస్‌క్లాస్‌లో దర్జాగా ప్రయాణించాలని చాలా విమాన ప్రయాణికులు ఆశపడతారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో లాంగ్ జర్నీ చేసేవారికి సౌకర్యవంతమైన సీట్లు చక్కటి ప్లేస్, ఆహారం ఇలా కొన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇది కేవలం సుదూర గమ్యస్థానాన్ని చేరుకోవడం గురించి మాత్రమే కాదు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోవంటి అల్ట్రా-లాంగ్ రూట్లలో సౌకర్యాలపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టికెట్ల ధర లక్షల్లో ఉంటుంది. అందులోనూ ఎయిరిండియా లాంటి విమానాలలో టికెట్ కోసం లక్షలు ఖర్చు చేసినప్పుడు, ఎవరైనా ప్రీమియం ఫీచర్స్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఫుడ్ బ్లాగర్ తనకెదురైన చేదు అనుభవాన్ని గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
పాపులర్ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించింది. ఈ ప్రయాణంలో తనకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది తన యూట్యూబ్ వీడియోలో. ఈ జర్నీకి 10- 6 రేటింగ్ ఇచ్చింది. వరుసగా తన అనుభవానాలకు ఏకరువు పెట్టింది. తొలుగ ఫస్ట్ సీట్ అస్సలు బాగాలేదని, తరువాత రెండో సీట్‌లోకి మారినా కూడా పరిస్థితిలాగే ఉందని నిరాశను వ్యక్తం చేసింది. ఇందు కోసమా తాన టికెట్‌కు రూ. 4లక్షలకు ఖర్చు చేశానని వాపోయింది.
విమానంలో ఆహారంపైకూడా పెదవి విరించింది. మంచి నిద్ర తరువాత బాగాతిందామని ఎదురుచూస్తే నిరాశే మిగిలిందనీ, మెయిన్ కోర్స్ తప్ప మిగతాది అస్సలు బాగాలేదని తెలిపింది. డెజర్ట్స్ అయితే దారణమని వ్యాఖ్యానించింది. అయితే డ్రింక్స్, షాంపైన్ మాత్రం బావున్నాయని చెప్పింది. అంతేకాదు తాను తినకపోవడం ఇదే మొదటిసారి అయిఉండాలని కూడా తెలిపింది. ఇక శుభ్రత మరొక బాధాకరమైన విషయమని పేర్కొంది. తన సీటుపై అక్షరాలా రెండు చచ్చిన ఈగల్ని చూశానని ఫిర్యాదు చేసింది. ఎందుకు? ఇలా అని ప్రశ్నించింది.
అయితే దటీజ్ ఎయిరిండియా అంటూనే కంఫర్ట్ పరంగా, సీట్లు, సౌకర్యవంతంగా ఉన్నాయని ఆమె అంగీకరించింది. బాగా నిద్రపోయానని వెల్లడించింది. తనకు వేరే మార్గం లేదని, అందుకే ఈ ఎయిరిండియావిమానంలో ప్రయాణించానని తెలిపింది. కానీ ఇన్ని ఫిర్యాదులున్నప్పటికీ ఎయిరిండియా ప్రయాణం అనుకున్నదానికంటే బావుంది అంటూ కితాబివ్వడం విశేషం. అయితే ఈ ఆరోపణలపై ఎయిరిండియా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.


