
విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనం (ఎస్‌ఏఎఫ్) సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాడేసిన వంట నూనె నుంచి ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఐవోసీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్ని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం అంతంతే!
పానిపట్‌లోని రిఫైనరీలో ఏటా 35,000 టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఐటీసీ, హల్దీరామ్స్ లాంటి హోటళ్లు, రెస్టారెంట్ చెయిన్స్ నుంచి నూనెను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. విమాన రవాణా వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోలియంయేతర ముడివనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఎస్‌ఏఎఫ్‌ను తయారు చేస్తారు. లభ్యతను బట్టి సాధారణంగా వినియోగించే విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో 50 శాతం వరకు దీన్ని కలపవచ్చు.