
న్యూఢిల్లీ: ఇండోర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానపు కుడి ఇంజిన్‌లో అగ్నిప్రమాద సూచన అందుకున్న దరిమిలా పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఢిల్లికి తిరిగి వచ్చిన విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశామని, ప్రయాణికులను ఇండోర్‌కు ప్రత్యామ్నాయ విమానంలో తరలించామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ‘ఆగస్టు 31న ఢిల్లీ నుండి ఇండోర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది.
కాక్‌పిట్ సిబ్బందికి ఇంజిన్‌లో మంటలు వస్తున్నట్లు సూచన అందింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి.. కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపివేయాలని నిర్ణయించుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత’ అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.
Indore-bound Air India plane returns to Delhi airport after fire indication in engine; lands safely https://t.co/OrMzQfYt5g
— JAMMU LINKS NEWS (@JAMMULINKS) August 31, 2025