భారతీయులకు థాయ్‌ వెలుగుల ఆహ్వానం | Grand Diwali celebration in Thailand aims to attract Indian tourists | Sakshi
Sakshi News home page

భారతీయులకు థాయ్‌ వెలుగుల ఆహ్వానం

Oct 18 2025 5:43 AM | Updated on Oct 18 2025 5:43 AM

Grand Diwali celebration in Thailand aims to attract Indian tourists

భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్‌ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది.  ‘గ్రాండ్‌ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా థాయ్‌ - భారత్‌ సాంస్కృతిక మేళవింపులతో వెలుగుల పండుగకు ఏర్పాట్లు చేస్తోంది. 

అద్భుత లైటింగ్‌ ప్రదర్శనలకు తోడు సాంస్కృతిక కార్యక్రమాల్లో లీనమయ్యే ప్రత్యేక అనుభవాలను పర్యాటకులకు అందించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. భారతదేశం వెలుపల అతిపెద్ద దీపావళి వేడుకను ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లైట్స్‌’గా పిలుస్తోంది. ఈ ఘట్టానికి ‘ఐకానిక్‌ ఓంగ్‌ ఆంగ్‌ కెనాల్, ఫహురత్‌ ప్రాంతాలను కేంద్ర బిందువులుగా మారుస్తోంది. - సాక్షి, అమరావతి

ఈ నెల 16 నుంచి 31 వరకు థాయిలాండ్‌లో గ్రాండ్‌ దివాళి వేడుక  భారత పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వచ్చేలా వ్యూహ రచన లైట్‌ షోలు, స్థానికృభారతీయ మేళవింపుతో సాంస్కృతిక ప్రదర్శనలు విమానాశ్రయాల నుంచే పర్యాటక సేవలపై రాయితీల జల్లు కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు దీపావళి వెలుగుల వేడుక ఇలా.. మధురానుభూతి మిగిలిపోయేలా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫహురత్, ఓంగ్‌ ఆంగ్‌ కెనాల్‌ ప్రాంతాల్లో వేడుకలు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోలు. 

కమ్యూనిటీ ఈవెంట్‌లు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోలు. కమ్యూనిటీ ఈవెంట్‌లు ప్రధాన ఆకర్షణగా థాయ్‌-ఇండియన్‌ రామాయణ ప్రదర్శన  లాంతర్‌ నృత్యాలు, భరత నాట్యం, అసోం నుంచి బిహు జానపద నృత్యం, బాలీవుడ్‌ నృత్యం, భారత సమకాలీన నృత్య ప్రదర్శనలుసహా  రెండు దేశాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు గోరింట (మెహందీ), లాంతరు పెయింటింగ్, పూసలుృబుట్ట నేయడం వంటి ఆటవిడుపు వర్క్‌షాపుల నిర్వహణ ప్రాన్‌ బిర్యానీ, మసాలా దోస, పానీపూరిసహా నోరూరించే  ఇతర భారతీయ వంటకాలు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించే  లక్ష్మీదేవి, గణేశుడి ఆరాధన కార్యక్రమాలు ఓంగ్‌ ఆంగ్‌ కెనాల్‌ తీరంలో రంగోలి, నీటిపై తేలియాడేనూనె దీపాల ప్రదర్శనలు  

లక్ష మంది హాజరు! 
‘అమేజింగ్‌ థాయిలాండ్‌ గ్రాండ్‌ దీపావళి ఫెస్టివల్‌’కు లక్ష మందికిపైగా హాజరవుతారని థాయ్‌ టూరిజం అథారిటీ ప్రకటించింది. ఈ ఒక్క వేడుక ద్వారానే ఆ దేశానికి 650 మిలియన్‌ బాట్ల (దాదాపు 20 మిలియన్‌ డాలర్లు) రెవెన్యూ వస్తుందని అంచనా వేసింది. దీనికి తోడు పర్యాటకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. 

డాన్‌ ముయాంగ్, సువర్ణభూమి విమానాశ్రయాల నుంచి వేడుక నిర్వహించే వేదికల వరకూ కీలక ప్రదేశాల్లో పర్యాటక సేవల వ్యయాలపై రాయితీలు కురిపిస్తోంది.  భద్రతను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలను వినియోగించనుంది. ఒక్క ఈ నెలలోనే భారతీయ సందర్శకుల సంఖ్య 30 శాతం పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. 60 రోజుల పాటు వీసా మినహాయింపు కల్పిం చింది.  

వ్యక్తికి రూ.90 వేల వరకు వ్యయం! 
ప్రతి ఏటా థాయిలాండ్‌ను సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌లో ఇప్పటి వరకు థాయిలాండ్‌లో దాదాపు 18 లక్షల మంది భారతీయులు పర్యటించారు. థాయ్‌కు అత్యధికంగా వచ్చే సందర్శకుల సంఖ్యలో మొదటి మూడు దేశాల్లో భారత్‌ ఒకటి. 

బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, కో స్మామ్యూయ్‌ వంటి థాయ్‌ గమ్యస్థానాలు భారతీయ పర్యాటకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. దీనిని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా ఈ ఏడాది నాటికి 25 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా థాయ్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది.  థాయ్‌కి వచ్చే భారతీయ సందర్శకులు సాధారణంగా సగటున ఒక వ్యక్తికి రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారని,  దాదాపు 6–7 రాత్రులు బస చేస్తారని తేలింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement