
2020 నుంచి పెరుగుతున్న ‘నాసిరకం’ లిస్ట్
నాణ్యత లేని మందులు బెంగాల్‌లో ఎక్కువ
ఈ ఏడాది 8 నెలల్లో 1,184 ఔషధాలు విఫలం
ఎన్ఎస్‌క్యూడీ పరీక్షల్లో వెల్లడైన వాస్తవాలు
విషపూరిత దగ్గు మందు సేవించి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో పిల్లల మరణాలు సంభవించిన ఘటనతో నాణ్యత లేని మందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి – ఆగస్టు మధ్య నిర్వహించిన నాన్–స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ (ఎన్ఎస్‌క్యూడీ) పరీక్షల్లో 1,184 మందులు నాణ్యత లేనివిగా తేలింది. వీటిలో ట్యాబ్లెట్స్ 51%, ఇంజెక్షన్లు 18%, సిరప్స్ 11% ఉన్నాయి.
నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్టుగా నాణ్య త, భద్రత, సామర్థ్య ప్రమాణాలు లేని ఔషధాలను ఎన్ఎస్‌క్యూడీగా పరిగణిస్తారు. 2019తో పోలిస్తే ఎన్ఎస్‌క్యూడీ పరీక్షల్లో నాసిరకమైనవని తేలిన ఔషధాల సంఖ్య దాదాపు మూడింతలు కావడం ఆందోళన కలిగించే అంశం. మనదేశంలో తయారైన దగ్గు సిరప్స్ 2023లో గాంబియాలో డజన్ల కొద్దీ పిల్లల మరణాలకు కారణమై వివాదానికి దారితీసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టులో లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 5 ఏళ్లలో నాణ్యత లేని ఔషధాల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో మొత్తం 1.16 లక్షలకుపైగా ఔషధాల శాంపిళ్లు పరీక్షించగా.. 3,104 నాణ్యత లేనివిగా తేలాయి. నకిలీ / కల్తీగా గుర్తించినవి 245. కల్తీ మందులపై పెడుతున్న కేసులు కూడా ఏటా పెరుగుతున్నాయి. నకిలీ మందులను అరికట్టడానికి.. కేంద్ర ప్రభుత్వం బార్ కోడ్ / క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఔషధాల లేబుళ్లు లేదా వీలున్న చోట బార్ కోడ్ ద్వారా.. ఆ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి.

పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో నాణ్యత లేని మందులకు సంబంధించి కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. అత్యధిక కేసులు (శాతాల్లో) నమోదైన రాష్ట్రాలు..
