
కేవలం 6.4% ఉద్యోగాలకే ఏఐ ప్రత్యామ్నాయం
కొత్త సాంకేతికత రాకతో 15.6% జాబ్స్ మెరుగు
ఏఐ జాబ్ పోస్టింగ్స్‌లో టాప్–2లో హైదరాబాద్
ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతాం అన్న భావన చాలామందిలో ఉంది. ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఈ ఆందోళన నెలకొంది. ఈ విషయంలో మనం సేఫ్! భారత్‌లో కేవలం 6.4 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.
అంటే కృత్రిమ మేధ రాకతో భారతీయులపై ప్రతికూల ప్రభావం అతి తక్కువే అన్నమాట. పైగా ఈ నూతన సాంకేతికత వల్ల 15 శాతానికిపైగా ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయని వివరించింది. ఏఐ నియామకాల్లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ పోటీపడుతుండడం విశేషం. ఇక ఏఐ పరివర్తనలో దక్షిణ ఆసియాలో భారత్ ముందంజలో దూసుకెళుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ వాటా దక్షిణాసియాలో ఇలా..
శ్రీలంక 7.3
భారత్ 5.8
నేపాల్: 3.4
బంగ్లాదేశ్: 1.4

» ఏఐ రాకతో భారత్‌లో 15.6 శాతం ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.
» 6.4 శాతం జాబ్స్‌ను మాత్రమే ఏఐ కైవసం చేసుకుంటుంది.
» సాంకేతిక సేవలకు పేరొందిన బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏఐ సంబంధ ఉద్యోగాలు కేంద్రీకృతమయ్యాయి.
» మొత్తం జాబ్ పోస్టింగ్స్‌లో ఏఐ సంబంధ ఉద్యోగాల వాటా మన దేశంలో 5.8 శాతం.
» ఏఐ జాబ్స్‌లో జాతీయ సగటును మించి నాలుగు నగరాలు ముందంజలో ఉన్నాయి.

దేశాల వారీగా ఏఐ రాకతో వివిధ రంగాల్లో మెరుగుపడే ఉద్యోగాలు, ప్రభావితం అయ్యే జాబ్స్, ఏమాత్రం ప్రభావం లేని విభాగాల శాతం