
ఐఎస్‌ఏసీఏ హైదరాబాద్ ఛాప్టర్ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నెన్స్, సైబర్‌సెక్యూరిటీ, ప్రైవసీ నిపుణులను ప్రోత్సహిస్తూ తమ 25వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు థీమ్: "ట్రస్ట్ ఏఐసీఎస్ - 2025: ఏఐ ఇంటిగ్రేట్స్ గవర్నెన్స్, సైబర్‌సెక్యూరిటీ, అండ్ ప్రైవసీ" అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది''.
ఈ సదస్సును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ శిఖా గోయెల్ ప్రారంభించారు. వారితో పాటు ఐఎస్‌ఏసీఏ హైదరాబాద్ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం 400 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాప్టర్ చరిత్రలోనే అత్యధికం. 2024లో జరిగిన సదస్సు విజయం ఈసారి కూడా కొనసాగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఐఎస్‌ఏసీఏ ఒక ముఖ్యమైన నిపుణుల సమూహంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈ సమావేశం గురించి శిఖా మాట్లాడుతూ.. "ISACA హైదరాబాద్ 25 సంవత్సరాల వేడుకలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలను నివేదిస్తూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన సాంకేతికత ఇప్పుడు మోసానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. నేడు అన్ని ప్రధాన రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఏఐ వ్యవస్థలను రక్షించడం మరియు జవాబుదారీతనం అనేది ఈ సమయంలో అత్యవసరం. ఏఐని సరిగ్గా, నైతికంగా ఉపయోగించాలనుకుంటే ISACA వంటి వృత్తిపరమైన సంస్థలు చాలా అవసరమని అన్నారు.