టీమ్‌ చాంప్‌ హైదరాబాద్‌ జట్టు | Hyderabad, Ranga Reddy shine at Telangana State table ... | Sakshi
Sakshi News home page

టీమ్‌ చాంప్‌ హైదరాబాద్‌ జట్టు

Nov 30 2025 8:22 AM | Updated on Nov 30 2025 8:22 AM

Hyderabad, Ranga Reddy shine at Telangana State table ...

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లాల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లు సత్తా చాటాయి. మూడు వేర్వేరు విభాగాల్లో హైదరాబాద్‌ జట్లు చాంపియన్‌గా నిలిచాయి. మొయినాబాద్‌ వేదికగా తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీ పురుషుల విభాగంలో హైదరాబాద్‌ జట్టు విజయం సాధించగా... రంగారెడ్డి జట్టు రెండో స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాకు మూడో స్థానం దక్కింది. 

మహిళల విభాగంలోనూ హైదరాబాద్‌ జట్టు రంగారెడ్డిపై గెలుపొందింది. పెద్దపల్లి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జూనియర్‌ పురుషుల విభాగంలో హైదరాబాద్‌ జట్టు అగ్రస్థానం దక్కించుకోగా... రంగారెడ్డి జట్టు రెండో స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జూనియర్‌ మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు టీమ్‌ చాంపియన్‌íÙప్‌ కైవసం చేసుకోగా... హైదరాబాద్, నల్లగొండ వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. టీమ్‌ చాంపియన్‌íÙప్‌ దక్కించుకున్న హైదరాబాద్‌ జట్లను రాష్ట్ర టీటీ సంఘం కార్యదర్శి నాగేందర్‌ రెడ్డి అభినందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement