గ్రేటర్‌లో మరిన్ని మల్టీ లెవల్‌ పార్కింగ్‌ స్టేషన్లు | Hyderabad’s First Multi-Level Car Parking at KBR Park | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో మరిన్ని మల్టీ లెవల్‌ పార్కింగ్‌ స్టేషన్లు

Nov 30 2025 8:10 AM | Updated on Nov 30 2025 8:10 AM

Hyderabad’s First Multi-Level Car Parking at KBR Park

బంజారాహిల్స్‌: రానున్న రోజుల్లో గ్రేటర్‌ పరిధిలో పర్యాటక ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని మల్టీ లెవల్‌ పార్కింగ్‌ స్టేషన్లు నిర్మిస్తామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద జీహెచ్‌ఎంసీ, నవ నిర్మాణ్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించిన మల్టీ లెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపిన ఆరు నెలల్లోనే మల్టీ లెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. తక్కువ స్థలంలో ఎక్కువ కార్లు నిలిపేలా స్మార్ట్‌ కార్‌ పార్కింగ్‌ వ్యవస్థను రానున్న రోజుల్లో నగరంలో మరిన్ని చోట్ల పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామన్నారు. కేబీఆర్‌ పార్కు వద్ద నిర్మించిన ఈ పార్కింగ్‌ సిస్టమ్‌లో ఒకేసారి 72 కార్లు పార్కింగ్‌ చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, కార్పొరేటర్‌ 
వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement