breaking news
Multi level parking
-
రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్
ప్రయాగ్‌రాజ్: సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా, బలంగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ దేశం స్థిరంగా నిలిచి ఉందని, ఆ క్రెడిట్ రాజ్యాంగానికే దక్కుతుందని స్పష్టంచేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ చాంబర్స్, మల్టి–లెవెల్ పార్కింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని రూపొందించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమరి్పంచిన సమయంలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నాయని కొందరు, ఏకీకృతంగా ఉందని మరికొందరు చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం పూర్తి సమాఖ్యం కాదు, పూర్తి ఏకీకృతం కాదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బదులిచ్చినట్లు తెలిపారు. యుద్ధం, శాంతితోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉంచే రాజ్యాంగం మనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్వర్ణ రథానికి రెండు చక్రాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమనత్వాన్ని తీసుకురావడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కృషి చేశాయని ఉద్ఘాటించారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయం చేకూర్చడం మన ప్రాథమిక విధి అని న్యాయమూర్తులు, న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఆ ఆఖరి వ్యక్తిదాకా చేరుకోవాలని సూచించారు. భూసంస్కరణలతో ఎంతోమందికి మేలు జరిగిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. భూస్వాముల నుంచి భూములు పేదలకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. భూసంస్కరణ చట్టాలను ఎంతోమంది కోర్టుల్లో సవాలు చేశారని వెల్లడించారు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ జరిగితే.. ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని 1973లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలే ఆత్మ అని పేర్కొంటూ, రాజ్యాంగ స్వర్ణ రథానికి ఇవి రెండు చక్రాలు అని వ్యాఖ్యానించారు. ఒక్క చక్రాన్ని ఆపినా మొత్తం రథం ఆగిపోతుందన్నారు. బార్, బెంచ్ అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని జస్టిస్ గవాయ్ స్పష్టంచేశారు. బార్, బెంచ్ కలిసికట్టుగా పనిచేయకపోతే రాజ్యాంగ రథం ముందకు సాగదని చెప్పారు. -
ఇక ‘పార్కింగ్’ పాలసీ
⇔ పార్కింగ్‌కు స్థలమిస్తే ప్రోత్సాహకాలు: కేటీఆర్ ⇔ పార్కింగ్ స్థలాల్లో నిర్మాణాలు కూల్చేస్తాం ⇔ హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో అమలు ⇔ హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్ సాక్షి, హైదరాబాద్: రాజధానితో సహా రాష్ట్రంలోని పట్టణాల్లో వాహనాల పార్కింగ్‌ను నియంత్రించేందుకు త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని పురపాలక మంత్రి కె.తారకరామా రావు గురువారం వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో పార్కింగ్ సమçస్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘‘రోడ్లను పరి రక్షించడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పాలసీ ఉం టుంది. నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పి స్తాం. ఖాళీ ప్రదేశాలను పార్కింగ్‌కు ఇచ్చేవారికి ప్రోత్సాహకా లిస్తాం’’ అని తెలిపారు. పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశాల్లో కట్టిన కాంప్లెక్సుల కూల్చివేతలను తక్షణమే చేపట్టాలని చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. కొత్త భవనాల నిర్మాణం లో నిర్దేశించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయిస్తే భవన నిర్మాణ అనుమతుల్లో ప్రత్యేక సడలింపులిచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ‘‘మెట్రో స్టేషన్లకు ట్రాఫిక్ ఇబ్బం దులు ఎదురవకుండా వాటికి అనుబంధంగా మల్టీ లెవెల్ పార్కి ంగ్, స్కై వాక్స్ సదుపాయాలను ఏర్పాటు చేయండి. పోలీస్ సిబ్బంది, నిపుణులతో కలసి సమగ్ర ప్రణాళిక రూపొందిం చండి’’ అని ఆదేశించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ, హెచ్ఎం డీఏ కమిషనర్లు బి.జనార్దన్‌రెడ్డి, చిరంజీవులు పాల్గొన్నారు.