ఎఫ్‌ఎస్‌టీసీలో అదానీ గ్రూప్‌నకు వాటాలు | Adani Group Shares in FSTC | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌టీసీలో అదానీ గ్రూప్‌నకు వాటాలు

Nov 30 2025 6:38 PM | Updated on Nov 30 2025 6:38 PM

Adani Group Shares in FSTC

డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పైలట్లకు శిక్షణ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ)లో 72.8 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఏడీఎస్‌టీఎల్‌), దానికి 50 శాతం వాటాలున్న హొరైజన్‌ ఏరో సొల్యూషన్స్‌ (హెచ్‌ఏఎస్‌ఎల్‌) సుమారు రూ. 820 కోట్లు వెచ్చించనున్నాయి.

ఎఫ్‌ఎస్‌టీసీకి హైదరాబాద్‌తో పాటు గురుగ్రామ్‌లో సిమ్యులేషన్‌ సెంటర్లు ఉన్నాయి. హర్యానాలోని భివాని, నార్నౌల్‌లో ఫ్లయింగ్‌ స్కూల్స్‌ నిర్వహిస్తోంది. సంస్థ 11 అధునాతన ఫుల్‌ ఫ్లయిట్‌ సిమ్యులేటర్లు, 17 ట్రైనింగ్‌ విమానాలు ఉన్నాయి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్సులకు శిక్షణ, ప్రత్యేక నైపుణ్యాల కోర్సులను అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement