యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తక్కువ మొత్తంతో ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ నిర్ణయించింది. ఇందుకు వీలుగా మైక్రోసిప్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.100 నుంచి యాక్సిస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ.1,000 పెట్టుబడిని పది పథకాల్లో రూ.100 చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా.. వాటి పనితీరును పరిశీలిస్తూ నష్టాల భయం లేకుండా మార్కెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చని పేర్కొంది.
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా మహీంద్రా మాన్యులైఫ్ ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్ పేరిట ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమును ఆవిష్కరించింది. పన్ను పరమైన ప్రయోజనాలను అందుకునేందుకు.. 24 నెలలు, అంతకుమించిన దీర్ఘకాలం పెట్టుబడులపై పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలమని సంస్థ ప్రకటించింది.
ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 1న ముగుస్తుంది. ‘‘డెట్, ఆర్బిట్రేజ్ వ్యూహాల సామర్థ్యాలను మేళవించి అన్ని పరిస్థితులకు అనువుగా ఉండే విధంగా ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్ రూపొందించాం. వడ్డీ రేట్లలో అస్థిరతలతో కూడిన అనిశి్చత మార్కెట్లలో, పన్నుల అనంతరం మెరుగైన రాబడులకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఆంథోనీ హెరెడియా తెలిపారు.
ఇదీ చదవండి: ఇక ఇన్వెస్ట్‌మెంట్ సలహా ఇవ్వాలంటే.. రూల్స్ మార్చిన సెబీ


