
పిండం ఎంపికలో కచ్చితత్వం, గర్భస్థ ఫలితాల్లో మెరుగుదలకు ఏఐ ఉపయుక్తం
హైదరాబాద్: అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకోవడం, తద్వారా గర్భస్థ ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ తమ ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పరిశోధనల ఫలితాల ప్రకారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫలితంగా గర్భస్థ ఫలితాలు 12% మెరుగుపడ్డాయని తేలింది. బంజారాహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని తమ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో నోవా ఈ ఏఐని ప్రవేశపెట్టింది.
ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో అత్యుత్తమ పిండాన్ని ఎంపిక చేయడం అనేది ఎంబ్రియాలజిస్టులు చేస్తారు. ప్రతి పిండాన్నీ డబుల్ చెక్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. సాధారణంగా మనుషులు చూసినప్పుడు కనిపెట్టలేని అనేక అంశాలను అది గుర్తిస్తుంది. తద్వారా కచ్చితత్వాన్ని పెంచి, ఐవీఎఫ్ సైకిల్ టైంలైన్లను తగ్గిస్తుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రం క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “ప్రస్తుతం మన దేశంలో ప్రతి నాలుగు జంటల్లో ఒకరికి సంతానరాహిత్య సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఫెర్టిలిటీ చికిత్సల్లో మరింత కచ్చితత్వం అవసరం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని సమకూర్చుకున్నాం. మా ఎంబ్రియాలజిస్టులు ఒక పిండాన్ని విశ్లేషించిన తర్వాత ఆ పిండం ఎదుగుదల, నాణ్యత ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వారు ఏఐ టూల్ ఉపయోగిస్తారు. ఇది మరింత కచ్చితంగా అంచనా వేయడం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్తలు (ఎంబ్రియాలజిస్టులు) పిండాన్ని ఎంచుకోగలరు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో, 90% ఐవీఎఫ్ సైకిళ్లను ఆ జంట సొంత అండాలు, శుక్రకణాలతోనే చేస్తాం. తద్వారా పిండం ఎంపికలో కచ్చితత్వాన్ని పెంచుతాం.
ఐవీఎఫ్ లాంటి చికిత్సలతో టెక్నాలజీ ఉపయోగం, వైద్యపరిజ్ఞానం వల్ల రోగులకు మరింత పారదర్శకత, విశ్వాసం కలుగుతాయి. తమ సొంత అండాలు, శుక్రకణాలే వాడుతున్నారా అని కనీసం 30% మంది జంటలు అడుగుతారని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు గుర్తించారు. మా దగ్గర ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తాం. దీనిద్వారా అన్ని పిండాలను ట్రాక్ చేయొచ్చు. దీనిద్వారా ప్రతి శాంపిల్‌కు ఒక విభిన్నమైన బార్‌కోడ్ లేదా చిప్ ఉంటుంది. ఏ ప్రొసీజర్ చేసేముందైనా సిస్టమ్ వీటిని డబుల్ చెక్ చేస్తుంది. ఏదైనా మ్యాచ్ కాకపోతే వెంటనే ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఉన్న ఎంబ్రియాలజిస్టులను అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రతి దశలోనూ రియల్‌టైంలో పరీక్షించడానికి అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.